బోరిగాంలో గోడ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

04-11-2026 | 04:58pm

కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యం 

నవంబర్ 04, నేరడిగొండ (విజయక్రాంతి ): గ్రామస్తులం అందరం ఒకే కుటుంబంలా కలిసి ఉంటేనే   అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) పేర్కొన్నారు. బుధవారం నేరడిగొండ మండలంలోని బోరిగాం గ్రామాలు పలు అభివృద్ధి పనుల్లో ఆయన పాల్గొన్నారు.

గ్రామసమీపంలోని కొండ చుట్టూ రూ. 3 కోట్ల నిధులతో గోడ నిర్మాణ పనులు, రూ. 10 లక్షలతో మహిళ సంఘ భవనంతోపాటు రూ. 10 లక్షలతో జగదంబా దేవి ఆలయ ప్రహారి నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.

అనంతరం ఇటీవల నిర్మించిన ఎం పీ పీ ఎస్ పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ వినేష్, నాయకులు సజన్, పండరి, రవీందర్ రెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు