విద్యార్థులకు టీ-షర్టుల పంపిణీ
04-11-2026 | 04:37pm
మల్లాపూర్, నవంబర్ 04 (విజయక్రాంతి): మల్లాపూర్ మండలం కొత్త ధాంరాజ్పల్లి గ్రామంలోని యూపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్(MLA Dr. Kalvakuntla Sanjay) టీ-షర్టులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఎమ్మెల్యే ముచ్చటించి వారి విద్యాభ్యాసం, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు టీ-షర్టులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా టీ-షర్టులు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్కు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.