సత్తుపల్లి మండలంలో పలు కార్యక్రమాలు
పాల్గొన్న డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్
సత్తుపల్లి. అక్టోబర్ 6. ( విజయ క్రాంతి ): సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్(Dr. Matta Dayanand Vijay Kumar) మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రేజర్ల గ్రామానికి చెందిన బూరుగు శ్రీలత నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ హాజరై, కుటుంబ సభ్యులను అభినందించారు.
అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన అదే గ్రామానికి చెందిన పసుపులేటి మురళి ని ఆయన నివాసంలో పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా, గ్రామ కాంగ్రెస్ నాయకులు షేక్ ఖలీల్ రెహమాన్ కుమార్తె షేక్ రుతియా బేగం బైక్‌పై నుంచి పడిపోవడంతో గాయపడగా, ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, రేజర్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.