రైతలందరు నీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది
ప్రత్యేక అధికారి సునీల్
కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలంలోని కొత్తూరు గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల ప్రత్యేక అధికారి సునీల్ పాల్గొని రైతులను(Farmers ) ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం(El Nino impact) దృష్ట్యా భూగర్భ జలమట్టం తగ్గిపోతుందని, అందువలన యాసంగిలో రైతులు వరి, మొక్కజొన్న వంటి పంటలు వేయవద్దని , తక్కువ నీటిని వినియోగించుకునే పెసర ,మినుము, వేరుశనగ, జొన్న వంటి పంటలను స్వల్పకాలిక పంటలను వేసుకోవాలని రైతులకు సూచించారు.
అనంతరం మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ కేత్ బచావో అభియాన్ పథకం ద్వారా రైతులకు భూ సంరక్షణ, నేలను మెరుగుపరచడం, భూసార పరీక్ష ఆధారంగా ఎరువుల వినియోగం, పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా కలిగే అనర్థాలు, ప్రకృతి వ్యవసాయం మొదలగు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నేటి పారుదల శాఖ ఏఈ నవీన్, విద్యుత్ శాఖ సిబ్బంది, సర్పంచ్ నీలకంఠం, గ్రామ పాలన అధికారి, పంచాయతీ కార్యదర్శి , ఏఈఓ రఘు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.