వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం

26-10-2026 | 09:06pm

బెల్లంపల్లి: బెల్లంపల్లి శ్రీ కోదండ రామాలయం(Bellampalli Sri Kodanda Ramalayam)లో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు(Valmiki Jayanti Celebrations) ఘనంగా నిర్వహించారు. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకలకు ముఖ్య అతిధులుగా మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమురాజుల శ్రీదేవి(MLA Amarajula Sridevi), బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కొయ్యల ఏమాజీ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

రామాయణం కేవలం శ్రీరాముని జీవిత కథ మాత్రమే కాదనిన్నారు. సమాజం పట్ల మన బాధ్యతలను ఎలా నిర్వర్తించాలనే విలువలను బోధించే మహాకావ్యమని వివరించారు. మహర్షి వాల్మీకి జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలనిన్నారు. ఈ కార్యక్రమంలోఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సీ హెచ్ కృష్ణదేవరాయలు, బీజేపీ సీనియర్ నాయకులు బొల్లెడ్ల కేశవరెడ్డి,జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు నర్సింగ్ రాజు, జిల్లా కార్యదర్శి సీహెచ్ స్వామి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కాసిపాక గంగారం,జిల్లా కౌన్సిల్ సభ్యులు శనిగారపు శ్రావణ్, నాయకులు నస్పూరి లక్ష్మణ్, గంపల నరేష్,రామ్ హరీష్, డోలే చంద్ర కాంత్,దుర్గం భరత్, సతీష్  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు