ముత్తారం కాంగ్రెస్ నాయకుల పరామర్శ
ముత్తారం,(విజయక్రాంతి): కమాన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు తండ్రి సాంబయ్య అకాల మరణం పట్ల ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు సోమవారం వైనాల రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, కమాన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల రాజన్న, ముత్తారం సింగిల్ విండో అధ్యక్షుడు యాదగిరిరావు, ముత్తారం మండల మైనార్టీ విభాగం అధ్యక్షుడు వాజిద్ పాషా తదితరులు వైనాల రాజు కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మృతుడు సాంబయ్యకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.