ఆపదలో ఉన్న పేద కుటుంబానికి వెదిరె పూలమ్మ ఫౌండేషన్ అండ
- మహేందర్ వైద్య ఖర్చుల కోసం రూ.50 వేల ఆర్థిక సాయం
మునుగోడు,(విజయక్రాంతి): మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్ఫూర్తితో ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలుస్తున్నామని కొంపల్లి గ్రామానికి చెందిన వెదిరె పూలమ్మ ఫౌండేషన్(Vedire Poolamma Foundation) చైర్మన్ వెదిరే మెఘారెడ్డి అన్నారు. మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన బోయపర్తి మహేందర్(Boyaparthi Mahender) గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న వెదిరె పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదిరె మేఘా రెడ్డి ఆసుపత్రికి వెళ్లి మహేందర్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్య ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.50,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు.ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం, బాధితులకు అవసరమైన సహాయం అందించడం తమ ఫౌండేషన్ లక్ష్యమని పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మహేందర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.