ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన డిసిసి అధ్యక్షులు

26-10-2026 | 09:17pm

లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

బోడుప్పల్,(విజయక్రాంతి): మల్కాజిగిరి కార్పొరేషన్,బోడుప్పల్ సర్కిల్ పరిధిలో, బోడుప్పల్ డివిజన్ ఇంద్రానగర్ కాలనీలో సోమవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ నూతన గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఇంటి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు పోగుల నర్సింహారెడ్డి, బోడుప్పల్ డివిజన్ అధ్యక్షుడు బొమ్మకు కళ్యాణ్, చెంగిచెర్ల డివిజన్ అధ్యక్షుడు పోగుల దిలీప్ రెడ్డి, కొత్త కిషోర్ గౌడ్, జై రాములు, బి. సత్యనారాయణ యాదవ్, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు ఏ. రాములు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు