తుడుం దెబ్బ గ్రామ కమిటీ ఎన్నిక

26-10-2026 | 09:12pm

కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని చిట్యాల గ్రామంలో తుడుం దెబ్బ గ్రామ కమిటీ(Thudum Debba Village Committee) ఎన్నిక గుండ్ల పాపారావు, మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించారు. చిట్యాల(Chityala) గ్రామ కమిటీ అధ్యక్షులు బంధం సుధాకర్, ఉపాధ్యక్షులు చాట్ల ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి ఇర్ప కృష్ణారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కంటెం జనార్దన్,అధికార ప్రతినిధి ఆలం బాబును ఎన్నుకున్నారు.

కార్యవర్గ సభ్యులుగా మడప దేవేందర్, ఆలం తిరుపతి, పోడెం సాయన్న ఈ కార్యక్రమానికి తుడుందెబ్బ జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు, జిల్లా నాయకులు యాలం మురళి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ తుడుం దెబ్బ సంస్థ బలోపేతం, ఆదివాసీల హక్కుల పరిరక్షణ, ఏజెన్సీ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు.అలాగే, డిసెంబర్ 9న నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆదివాసీ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు