విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

26-10-2026 | 09:08pm

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్మల్ పోలీస్.. మీ పోలీస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాల అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందని ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాయిడ్ తెలిపారు.

పోలీస్ అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా పాఠశాలలో ఈ పోటీలు నిర్వహించామని దీనికి తొమ్మిది, పది తరగతులు విద్యార్థులు పాల్గొన్నారని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన మూడు వ్యాసాలను రివార్డుల కోసం ఎంపిక చేయడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు