పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి అండ
32 మంది లబ్ధిదారులకు రూ.32.03 లక్షల చెక్కుల పంపిణీ
అక్కన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్ గౌడ్
కోహెడ,(విజయక్రాంతి): పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోందని అక్కన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్ గౌడ్ అన్నారు. అక్కన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో 32 మంది లబ్ధిదారులకు రూ.32,03,712 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను తహసీల్దార్ మధుసూదన్‌తో కలిసి ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ చొరవతో నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అర్హులు ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి ఉండి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.