ప్రభుత్వం రైతులకు వాగ్దానం చేసిన హామీలను అమలు చేయాలని వినతి
ఘట్ కేసర్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వాగ్దా చేసిన హామీలను అమలు చేయాలని భారతీయ కిసాన్ సంగ్(Bharatiya Kisan Sangh) ఘట్ కేసర్ మండల అధ్యక్షులు కొంతం అంజిరెడ్డి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పన్యాల వెంకటరెడ్డి పాల్గొని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేయడం జరిగినది.
ప్రస్తుత ప్రభుత్వం వరంగల్ లో రైతులకు వాగ్దానం చేసిన డిక్లరేషన్ ప్రకారంగా రెండు లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేయాలని, పంట బీమా, రైతు బీమా రైతుకు వర్తించే విధంగా ప్రభుత్వం అమలు చేయాలని, రూ. 500 బోనస్ చెల్లించాలని, రూ. 15 వేల వరకు రైతుబంధు చెల్లించాలని, రైతు కూలీలకు, కౌలు రైతులకు సంవత్సరానికి రూ. 12 వేలు అందించాలని ప్రభుత్వం హామీ ఇచ్చిన అన్నిటిని అమలు చేయాలని వినతిపత్రం లో డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సురేందర్ రెడ్డి, బొప్పా శ్రీనివాస్ రెడ్డి, కందకట్ల సుదర్శన్ రెడ్డి, కొంతం రామ్ రెడ్డి, సంజీవరెడ్డి, రామలింగారెడ్డి, శ్రీనివాసరాజు, వెంకట్ రెడ్డి, మొదలగు వారు పాల్గొన్నారు.