పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం..

27-11-2026 | 04:26pm

తాడూరులో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల సేవా కార్యక్రమం

తంగళ్ళపల్లి నవంబర్ 27 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం తాడూరు గ్రామంలో(Tadooru Village) తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల(Telangana Tribal Welfare Women’s Degree College) సిరిసిల్ల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శీతాకాల ప్రత్యేక శిబిరంలో భాగంగా శుక్రవారం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు గ్రామంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ లావణ్య మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో అనేక రకాల వ్యాధులను అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సదానందం ఉపసర్పంచ్ శ్రీధర్ పంచాయతీ కార్యదర్శి కవిత ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు