కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం

27-09-2026 | 05:04pm

కరీంనగర్ ,సెప్టెంబర్27(విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) జీవితం, పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని  అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి,కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్ బైపాస్ చౌరస్తాలోని ఆ మహనీయుడి విగ్రహానికి మేయర్ కొలగాని శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) డి. శ్రీనివాస్ రెడ్డి డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు, కార్పొరేటర్లు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, పద్మశాలి సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్, బీసీ సంక్షేమ శాఖ ఎం. అనిల్ ప్రకాష్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు పడిశెట్టి వసంత లక్ష్మి భూమయ్య, వేముల కవిత చంద్రశేఖర్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం, జిల్లా గౌరవ అధ్యక్షుడు వాసాల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వొల్లాల కృష్ణహరి, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు గుడిమళ్ల శ్రీనివాస్, పట్టణ సంఘం ప్రధాన కార్యదర్శి పోరండ్ల రమేష్, ప్రధాన కార్యదర్శి అల్స భద్రయ్య, మాజీ సుడా డైరెక్టర్ వంగర రవీందర్, యువజన సంఘం ఉపాధ్యక్షుడు మెతుకు కృష్ణ చైతన్య, జిల్లా ఉపాధ్యక్షుడు స్వర్గం నర్సయ్య, ప్రచార కార్యదర్శి మార్క ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు