పేద ప్రజల కడుపు నింపే సన్నబియ్యం పథకం నాకు సంతృప్తినిచ్చింది

27-09-2026 | 06:06pm

స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ నా మనసుకు దగ్గరైన పథకం..

పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే..

దేశంలో బిజెపి అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ సన్నబియ్యం పథకం లేదు..

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

నేరేడుచర్ల, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): పేద ప్రజల కడుపునింపే సన్నబియ్యం పథకం నాకు సంతృప్తినిచ్చిందని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. ఆదివారం నేరేడుచర్ల పట్టణంలోని ఎస్కేఎస్ ఫంక్షన్ హాల్ లో నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు మండలాల అర్హులైన ప్రజలకు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్(Collector Tejas Nandlal Pawar)తో కలిసి ఆయన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నా మనసుకు దగ్గరగా ఉన్న పథకం అని, దేశంలో బిజెపి అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ సన్నబియ్యం పథకం లేదన్నారు. 10 సంవత్సరాల బిఆర్ఎస్ హయాంలో రేషన్ ద్వారా పంపిణీ చేసిన దొడ్డిబియ్యంను ప్రజలు తినకుండా కోళ్ల ఫారంలలో దాణా లాగా.. బీర్ల తయారీలో, రైస్ మిల్లుల్లో పాలిష్ చేసి సన్న బియ్యంగా మార్చి అక్రమ దందాకు వాడినరు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో సన్న వడ్ల రకాల కి బోనస్ ఇవ్వటంతో పాటుగా, మన దగ్గర పoడిన సన్న రకం వరిని మిల్లుల్లో సన్నబియ్యoగా మార్చి,రేషన్ దుకాణాల ద్వారా మన తెలంగాణ పేదలకే పంపిణీ చేస్తున్నం. జనాభాలో 25% కంటే ఎక్కువ మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత కాంగ్రెస్కు దక్కింది. గత బిఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు కుటుంబ సభ్యుల చేర్పులు జరగలేదు.

అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తూ, కుటుంబంలో ఒక్కో వ్యక్తికి 6 కేజీల బియ్యం ఇచ్చి పేద, మధ్యతరగతి వారి కడుపు నింపుతున్నo. స్మార్ట్ రేషన్ కార్డులు భద్రతకు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకోవచ్చు. బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 16.32,810 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. తెలంగాణలో మొత్తం కలిపి1.06,28,092 రేషన్ కార్డులు ఉన్నాయని, దీంతో 3,42,57,109 మంది ఆహార భద్రత లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం కలిపి 3,72,658 రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. 

రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం:-

దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం అన్నారు.బిజెపి ఓటు చోరీకి పాల్పడి,ఎన్నికల్లో గెలుస్తుందని ఆరోపించారు.దేశంలో బిజెపి ప్రభుత్వం సామాన్యు ప్రజలను మోసం చేస్తుందన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పేరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర అగ్రికల్చర్ కమిటీ సభ్యులు చెవిటి వెంకన్న, జిల్లా ఎస్పీ నరసింహ, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, హుజూర్ నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి, పాలకవీడు మండల పార్టీ అధ్యక్షుడు సుబ్బారావు, మాజీ ఎంపీపీ గోపాల్, మాజీ జెడ్పీటీసీ మోతిలాల్, గరిడేపల్లి మండల అధ్యక్షుడు త్రిపురం అంజన్ రెడ్డి, నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి, తహసిల్దార్ సైదులు, వాజిద్, స్రవంతి,మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు