నీట్ పిజిలో ఉత్తమ ర్యాంకు సన్మానం
27-09-2026 | 06:31pm
చెన్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) చెన్నూర్ పట్టణానికి చెందిన మహ్మద్ జీహాన్(Mohammed Jeehan) నీట్ పిజి ఎంట్రన్స్(NEET PG Entrance) 2026 లో జరిగిన పరీక్షలో ఉత్తమ ర్యాంకు(Best Rank) సాధించాడు. 570 మార్కులు సాధించి ఆల్ ఇండియా 941వ ర్యాంక్ సాధించిన డా. మహమ్మద్ జీహాన్ను భక్తావర్ మసీదులో శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఆయన సాధించిన విజయం విద్యార్థులకు, యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు అభినందించారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షిస్తూ డా. మహమ్మద్ జీహాన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు, ప్రముఖులు, యువకులు మరియు స్థానికులు పాల్గొన్నారు.