పోలీసుల వీక్లీ ఆఫ్‌పై నటుడు కార్తి సంచలన వ్యాఖ్యలు!

27-09-2026 | 06:24pm

ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు విధులు నిర్వర్తించే పోలీసులకు వారాంతపు సెలవులు ఎందుకు ఇవ్వడం లేదని నటుడు కార్తి(Actor Karthi) ప్రశ్నించారు.కోయంబత్తూరులో జరిగిన మాజీ పోలీస్ అధికారుల ట్రస్ట్ 10వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీ మేరకు పోలీసులకు వెంటనే వారాంతపు సెలవులు అమలు చేయాలని టీవీకే ప్రభుత్వాన్ని కోరారు.అంకితభావంతో పనిచేస్తున్న పోలీసులకు మీడియా కూడా అండగా నిలవాలని కార్తి అన్నారు.“డీఎంకే అయినా.. టీవీకే అయినా.. పోలీసుల సంక్షేమం విషయంలో మార్పు రావాలి” అంటూ వ్యాఖ్యానించారు.


మరిన్ని వార్తలు