బ్యాక్ టు బ్యాక్ వికెట్లు.. విండీస్‌పై కుల్దీప్ స్పిన్ దెబ్బ!

27-09-2026 | 05:19pm

వెస్టిండీస్ బ్యాటర్లకు టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) చుక్కలు చూపిస్తున్నాడు. వరుసగా రెండు వికెట్లు పడగొట్టడంతో పాటు మెయిడిన్ ఓవర్ వేసి సత్తా చాటాడు. సెంచరీ హీరో గ్రీవ్స్‌(101)తో పాటు జ్యువెల్ ఆండ్రూ(0)ను పెవిలియన్‌కు పంపాడు. హ్యాట్రిక్‌కి అడుగు దూరంలో ఆగిపోయాడు. 36ఓవర్లకు వెస్టిండీస్ 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేయగా.. అందులో కుల్దీప్‌దే కీలక పాత్ర. ఇప్పటివరకు 4 వికెట్లతో కరీబియన్ బ్యాటింగ్‌ను కుదిపేశాడు!

మరిన్ని వార్తలు