​పర్యాటకంతోనే స్థానిక వికాసం

27-09-2026 | 05:59pm
  1. ​నర్సాపూర్ అర్బన్ పార్క్‌లో ఘనంగా ‘ప్రపంచ పర్యటక దినోత్సవం’
  2. అధికారులు, ప్రజాప్రతినిధుల నేతృత్వంలో భారీ ర్యాలీ

​​నర్సాపూర్ సెప్టెంబర్ 27: పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో స్థానికంగా ఉపాధి అవకాశాలు(Employment opportunities) పెరిగి, ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందని మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మీ రాజు యాదవ్ అన్నారు. ప్రపంచ పర్యటక దినోత్సవాన్ని(World Tourism Day) పురస్కరించుకొని ఆదివారం నర్సాపూర్ అటవీ ప్రాంతం(Narsapur forest area)లోని అర్బన్ పార్క్‌లో(Urban Park) అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పర్యావరణ పరిరక్షణపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దివ్య, ఎంపీడీవో భారతి, తహసీల్దార్ శ్రీనివాస్‌లు ర్యాలీని ప్రారంభించారు. చారిత్రాత్మక కట్టడాలు, ప్రకృతి రమణీయత, అటవీ సంపదను పరిరక్షించు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నర్సాపూర్ అర్బన్ పార్క్ పట్టణ వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ఆరోగ్య పునరుత్తేజాన్ని అందిస్తోందని తెలిపారు.  ​ఈ కార్యక్రమంలో ఏపీఓ అంజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్, అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు