కంటెస్టెంట్‌గా ఎంట్రీ.. భారీ ఆఫర్‌తో ఎగ్జిట్!
27-09-2026 | 06:07pm
బిగ్‌బాస్(Bigg Boss) తెలుగు సీజన్ 10లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ(Wild card entry)గా హౌస్‌లోకి అడుగుపెట్టిన మిథిలేష్(Mithilesh).. కేవలం రెండు రోజులకే షో నుంచి తప్పుకున్నాడు. నాగార్జున ప్రకటించిన రూ.15 లక్షల సూట్‌కేస్ ఆఫర్‌ను స్వీకరించి బయటకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. కుటుంబ అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిథిలేష్ చెప్పాడు. హౌస్మేట్స్ తొలుత అడ్డుకునే ప్రయత్నం చేసినా.. మెజారిటీ ఓటింగ్‌తో అతని నిర్ణయానికి అంగీకరించారు. దీంతో భారీ మొత్తంతో అతి తక్కువ సమయంలో షో నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్‌గా మిథిలేష్ నిలిచాడు.