మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారులు..
27-09-2026 | 05:49pm
ఫిబ్రవరి 17 నుండి 20 వరకు మేడారం మినీ జాతర
ములుగు, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): వచ్చే సంవత్సరం జరగనున్న మేడారం మినీ జాతర తేదీలను మేడారం సమ్మక్క సారలమ్మ(Medaram Sammakka-Saralamma) పూజారులు ఆదివారం ప్రకటించారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుండగా మధ్యలో వచ్చే సంవత్సరంలో పూజారులు మినీ జాతర నిర్వహిస్తారు. ఈ క్రమంలో మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సైతం లక్షల సంఖ్యలో భక్తులు మేడారంకు తరలివస్తారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 17 నుండి 20 తేది వరకు నాలుగు రోజులపాటు మేడారం మినీ జాతరను నిర్వహించనున్నట్టు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధమైన జగ్గారావు, కార్యదర్శి చందా గోపాల్ రావు పూజారులు ప్రకటించారు.