ఆర్ఎంపీ, పీఎంపీ ములుగు జిల్లా నూతన కమిటీ ఎన్నిక
జిల్లా అధ్యక్షులు జన్నారపు రమేష్
ప్రధాన కార్యదర్శిగా బోరగాని బాబురావు
ఆర్గనైజేషన్ సెక్రటరీ పంతంగి నాగరాజు
తోట అనిల్ కుమార్
కన్నాయిగూడెం/ ఏటూరునాగారం, సెప్టెంబర్ 27(విజయక్రాంతి) : తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఆర్ఎంపీ, పీఎంపీ వ్యవస్థాపక అధ్యక్షులు. ఎస్ ఎన్ హరిబాబు(SN Haribabu) ఆధ్వర్యంలో ములుగు జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ములుగు జిల్లా గౌరవ అధ్యక్షులుగా డీపీ జనార్దన్, జిల్లా అధ్యక్షులుగా జన్నారపు రమేష్, ప్రధాన కార్యదర్శిగా బోరగాని బాబురావు,కోశాధికారిగా రాజేష్ కుమార్,ఉపాధ్యక్షులు నర్సింహారావు, సదానందం, సంజీవరెడ్డి, ఆర్గనైజేషన్ సెక్రటరీ తోట అనిల్, పంతంగి నాగరాజు పటేల్ ను ఎన్నుకున్నారు.
ఆర్.ఎం.పి విఎంపి వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ఎన్ హరిబాబు(S.N. Haribabu, Founding President of RMP-VMP) మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు మాత్రమే ఇంటింటా తిరిగి ప్రజాసేవ ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ రాత్రి అనక పగలనక వైద్య సేవలు అందిస్తున్నామని . ఐఎంఏ వాళ్లు గ్రామీణ వైద్యుల మీద కక్ష సాధింపుగా పెట్టుకుని దాడులు జరుపుతూ, అమాయక గ్రామీణ వైద్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.
గ్రామీణ వైద్యులు కూడా వారికి వచ్చే ప్రాథమిక వైద్యాన్ని(Primary medical) మారుమూల గ్రామ ప్రజలకు అందిస్తూ జీవనోపాధి చేసుకుంటున్నారు. అర్ధాంతరంగా ప్రాథమిక వైద్యం చేసే గ్రామీణ వైద్యులను వైద్యం ఆపేయమని చెప్తే తెలంగాణ రాష్ట్రంలో సుమారు 45 వేల మంది గ్రామీణ వైద్యులు ఉన్నారని అర్ధాంతరంగా మారుమూల గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రథమ చికిత్స(First Aid) అందజేసి జీవనోపాధి గడిపే గ్రామీణ వైద్యులను వాళ్ళ కుటుంబాలను రోడ్డుమీదికి పడితే వారి కుటుంబ జీవన విధానం ఎలా జరుగుతదని అన్నారు.
ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రధమ చికిత్స అందజేసే గ్రామీణ వైద్యులను గుర్తించి శిక్షణ తరగతులు నిర్వహించి ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో 10మండల నుంచి 100-150 మంది గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు..