డీజే మోతకు పైకప్పు షేక్.. వీడియో వైరల్..!

27-09-2026 | 03:14pm

తెలంగాణలో వినాయక నిమజ్జనం వేడుకల్లో డీజే సౌండ్‌(DJ sound) ఓ కుటుంబానికి షాక్ ఇచ్చింది. మెదక్ జిల్లా రామాయంపేట(Ramayampet)లో నిమజ్జనం సందర్భంగా భారీ శబ్దంతో డీజే పెట్టి తెల్లవారుజాము వరకు యువత డ్యాన్స్ చేశారు.అయితే ఆ డీజే సౌండ్ ధాటికి పక్కనే ఉన్న ఓ ఇంటి పైకప్పు పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడ్డాయి.

ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఓ మహిళపై పెచ్చులు పడటంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దీంతో వేడుకల సందడి కాస్తా.. ఆ కుటుంబంలో ఆందోళనకు దారితీసింది. భారీ శబ్దాలతో డీజేలు పెట్టడం వల్ల ఇళ్లకు నష్టం వాటిల్లే పరిస్థితులు రావడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు