అండర్-19 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక
30-10-2026 | 02:49pm
కరీంనగర్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): తేజస్ కళాశాలకు(Tejas College) చెందిన విద్యార్థి కె. అభిషేక్ అండర్-19 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు(State-level cricket tournament) ఎంపికయ్యాడు. ఇటీవల కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన క్రికెట్ సెలక్షన్స్‌లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు.
ఈ నెల 31 నుంచి నవంబర్ 3 వరకు మహబూబ్‌నగర్‌లో జరిగే పోటీల్లో కరీంనగర్ జిల్లా జట్టు తరఫున అభిషేక్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ సతీష్ రావు, కోచ్ నరేన్, వ్యాయామ ఉపాధ్యాయులు అభిషేక్‌ను అభినందించి రాష్ట్రస్థాయిలో రాణించి విజయం సాధించాలని ఆకాంక్షించారు.