బిఆర్ఎస్ పార్టీ నాయకుల రాస్తారోకో
తలమడుగు అక్టోబర్ 30(విజయక్రాంతి) : తలమడుగు మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ(BRS Party) ఆధ్వర్యంలో సుంకిడి గ్రామంలో(Sunkidi Village) రాస్తారోకో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. రైతుల పంటలు ఎండిపోయి తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల కన్నీళ్లు, ఎండిన పంటలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కరవు మండలంగా ప్రకటించకపోతే ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్,కన్వీనర్ వెంకటేష్, కేదారేశ్వర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,అబ్దుల్లా,అభిరామ్ రెడ్డి, ప్రకాష్,చంటి, లక్ష్మారెడ్డి, రవికాంత్ యాదవ్, రాంకిషన్,సునీత, పల్లవి, రాంబయి,రమేష్, పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు