ఎల్లంపేట్ మున్సిపాలిటీలో జెట్టింగ్ మిషన్ ప్రారంభం

30-10-2026 | 05:00pm

మున్సిపల్ చైర్ పర్సన్ లావుడ్యా శ్రీదేవి రమేష్ నాయక్

మేడ్చల్ అర్బన్ అక్టోబర్ 30(విజయక్రాంతి):ఎల్లంపేట్ మున్సిపాలిటీలో(Yellampet Municipality) రూ,46.50 లక్షల వ్యయంతో నూతనంగా సమకూర్చిన జెట్టింగ్ మిషన్ ను(Jetting machine) కొనుగోలు చేసి మున్సిపల్ చైర్ పర్సన్ లావుడ్యా శ్రీదేవి రమేష్ నాయక్,మున్సిపల్ కమిషనర్ కృష్ణా రెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని చెప్పారు.

ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచడం,మురుగునీటి కాలువల్లో ఏర్పడే అడ్డంకులను తొలగించడం,ప్రజలకు ఎదురయ్యే అండర్ డ్రైనేజీ సమస్యలను సకాలంలో పరిష్కరించడం కోసం జెట్టింగ్ మిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమే తెలిపారు.

అత్యాధిక యంత్రం అందుబాటులోకి రావడం వల్ల మున్సిపల్ లో పారిశుధ్య పనులు వేగవంతంగా సమర్థవంతంగా నిర్వహించడానికి సులభతరంగా ఉంటుందని మున్సిపల్ కమిషనర్ కృష్ణా రెడ్డి వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి.మున్సిపల్ కౌన్సిలర్ లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు