క్రీడలతో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఆర్చరీలో తెలంగాణకు రెండు స్వర్ణ పతకాలు
- క్రీడాకారిణి చికితకు రూ.4.32 కోట్ల ప్రోత్సాహం
- సుల్తానాబాద్ క్రీడలకు పుట్టినిల్లు
- రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు
సుల్తానాబాద్, అక్టోబర్ 30 (విజయ క్రాంతి): క్రీడల ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడంతోపాటు రాష్ట్రానికి, దేశానికి గొప్ప పేరు తీసుకురావచ్చని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు(Peddapalli MLA Chintakunta Vijaya Ramana Rao) అన్నారు.శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-17 బాలబాలికల వాలీబాల్ క్రీడా పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులను అభినందిస్తూ, క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక వికాసానికి, క్రమశిక్షణకు, ఆత్మవిశ్వాసానికిదోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు పట్టుదలతో సాధన చేస్తూ తమ ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు.
సుల్తానాబాద్ క్రీడలకు పుట్టినిల్లు అని, ఇక్కడి నుండి ఎంతోమంది క్రీడాకారులు జాతీయ, రాష్ట్ర స్థాయిలో విజయాలు సాధిస్తున్నారు అన్నారు,పెద్దపల్లినియోజకవర్గంలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన ఆర్చరీ క్రీడాకారిణి చికిత ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించడం తెలంగాణకు గర్వకారణమని విజయరమణారావు అన్నారు.
గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగిన క్రీడాకారిణి అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరచడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. చికిత సాధించిన విజయాలు జిల్లాలోని యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, నిరంతర సాధనతో ముందుకు సాగితే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని ఆమె నిరూపించారని కొనియాడారు.క్రీడాకారిణి చికితకు రూ.4.32 కోట్ల ప్రోత్సాహం అందించడం క్రీడా ప్రతిభకు లభిస్తున్న గుర్తింపునకు నిదర్శనమని తెలిపారు.
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని విజయరమణారావు తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. క్రీడా రంగాన్ని గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి చేయడం, యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం.
ప్రతిభావంతులైన క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఖేలో ఇండియా క్రీడలను రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా క్రీడా రంగానికి మరింత ప్రాధాన్యం లభిస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్, కార్యదర్శి అమీర్ శెట్టి తిరుపతి, జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్, జీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడు రత్నాకర్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మాధవీలత,
యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ నోడల్ ఆఫీసర్ తుల శోభారాణి, పీఈటీ అధ్యక్ష, కార్యదర్శులు డా. సురేందర్, దాసరి రమేష్,మున్సిపల్ కౌన్సిలర్లు గాజుల రాజమల్లు, శ్రావణి రాకేష్, ప్రభాకర్, వర ప్రదీప్, చింతల రాజు, గదాస్ రవీందర్, సాయిరి మహేందర్ , కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న ) అబ్బాయి గౌడ్, కుమార్ కిషోర్, దామోదర్ రావు, మహేందర్,
తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గిన్నె లక్ష్మణ్, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు,వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, వీర్‌పాల్, ప్రభాకర్, కుమార్, ఖాజాబీ, శైలజ, సంధ్య, శ్రీవాణి, రూపారాణి, నిర్మల, రాము, అనూప్, సాగర్ తదితరులు, విద్యార్థులు హాజరయ్యారు.