చండ్రుగొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ప్రభుత్వానికి డిమాండ్..
చండ్రుగొండ, అక్టోబర్ 30 (విజయక్రాంతి ): ఎలినో ప్రభావంతో(The El Niño effect) ఏర్పడిన వర్ష భావ పరిస్థితులు కారణంగా చండ్రుగొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ శుక్రవారం మండల బీఆర్ఎస్ నాయకులు(BRS leaders) తహసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.
.చండ్రుగొండ చుట్టుపక్కల ఉన్న మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, చండ్రుగొండ మండలాన్ని కరువు మండలంగా జాబితాలో చేర్చకపోవడంతో ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని,ఎలినో ప్రభావంతో రైతులు వేసిన వరి, మిర్చి, పత్తి పంటలు దిగుబడి తగ్గి రైతులకు నష్టం వచ్చే అవకాశం ఉన్నందున రైతంగాన్ని దృష్టిలో ఉంచుకొని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పిటిసి కొణకండ్ల వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీ దారా బాబు గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.