ఉచిత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు

30-10-2026 | 04:47pm

చుంచుపల్లి, అక్టోబర్ 30(విజయక్రాంతి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో(District Central Library) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను(MLC Voter Registration Process) ఉచితంగా ప్రారంభించినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు తెలిపారు. చైర్మన్ పసుపులేటి వీరబాబు ఆధ్వర్యంలో నూతన గ్రంథాలయ భవనంలో ఉచిత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ నమోదు ప్రక్రియ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రేడ్-2 గ్రంథపాలకురాలు ఎస్. లలిత కుమారి, జి. మణి మృదుల, కంప్యూటర్ ఆపరేటర్ విజయ్, విద్యార్థినీ విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు