నశా ముక్త్ భారత్ పోస్టర్ ఆవిష్కరణ

30-10-2026 | 04:56pm

కన్నాయిగూడెం, అక్టోబర్ 30(విజయక్రాంతి): ములుగు జిల్లా కలెక్టర్(District Collector) మరియు రెడ్ క్రాస్ అధ్యక్షులు డాక్టర్ అలెం అప్పయ్య(Dr. Alem Appayya)  ఆదేశాల మేరకు శుక్రవారం రోజున కన్నాయిగూడెం తహసీల్దార్ సర్వర్ పాషా  చేతుల మీదుగా నశ ముక్త్ భారత్ పోస్టర్(Nasha Mukt Bharat poster) ఆవిష్కరణ చేసారు.

అనంతరం తహసీల్దార్ సర్వర్ పాషా మాట్లాడుతూ యువత చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ తంబాకు,గుట్కా, సిగరెట్,గంజాయి లాంటి మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా రెడ్ క్రాస్ మెంబెర్ అబ్బు సతీష్ మరియు ముప్పనపల్లి సహాయ నిధి సభ్యులు బోనాముక్కుల కాటన్ రెడ్డి,తడకల ప్రతాప్,బండి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు