మహిళలను నిండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

30-10-2026 | 05:03pm

ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో (Telangana State)మహిళలను అబద్ధపు మాటలతో కాంగ్రెస్ మంత్రులు, ప్రభుత్వం నిండా మోసం చేస్తున్నదని అఖిల భారత మహిళా సమైక్య(All India Women's Federation) జిల్లా కార్యదర్శి పి స్వరూప ఎస్ లక్ష్మి(District Secretary P. Swarupa S. Lakshmi) దుయ్యబట్టారు. శుక్రవారం ఖానాపూర్లో వారు విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రంలో దసరా, బతుకమ్మ పండుగకు ముఖ్యమంత్రి, మంత్రులు సీతక్క, బట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి, మహిళలకు చీరలు, పంపిణీ కొత్త పెన్షన్ ల పంపిణీ ,చేస్తామని పండుగలు సంబరంగా చేసుకోవాలని హామీ ఇచ్చి మోసం చేస్తూ  ఏళ్లు గడుపుతున్నారు అని అన్నారు. ఇలాగే మహిళలను మోసం చేస్తూ కాలం గడిపితే కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు