కార్యనిర్వహణ చైర్మన్ గా ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు

11-09-2026 | 08:54pm

కరీంనగర్,(విజయక్రాంతి): మండలి తాత్కాలిక కార్యనిర్వాహణ  చైర్మన్ గా ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు(MLC Bhanu Prasad Rao)కు అవకాశం దక్కింది. తెలంగాణ శాసన మండలి సమావేశాల్లో(Telangana Legislative Council meetings) తెలంగాణ రాష్ట్రంలో మోస్ట్ సీనియర్ సభ్యులుగా ఉన్న  ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్ రావు కార్యనిర్వాహణ  చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తానిపర్తి భానుప్రసాద్ రావు కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మొదట కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, 2009లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత గులాబీ పార్టీలో కొనసాగి ఫిబ్రవరి 2023లో శాసనమండలి చీఫ్ విప్‌గా నియమితులయ్యారు. జూలై 2024లో ఆయన తిరిగి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మరిన్ని వార్తలు