కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే అర్హులైన వారికి పెన్షన్లు

24-11-2026 | 06:18pm

జైనథ్, నవంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అధికారంలోకి వచ్చాకే నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఆసరా పెన్షన్ మంజూరు చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ జైనథ్ మండల కన్వీనర్ సంతోష్ రెడ్డి అన్నారు.

మంగళవారం మండలంలోని బెల్గం లో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ పత్రాలను అందజేశారు. పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అర్హులను వదిలేసి, అనర్హులకు పెన్షన్లు అందించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం గణపతి, నాయకులు కుంట జగదీష్ రెడ్డి, తిరుపతి, రవి, దేవన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు