తాండూర్ లో గ్రామసభ పలు అభివృద్ధి కార్యక్రమాలకు తీర్మానం

06-10-2026 | 06:59pm

నాగిరెడ్డిపేట (విజయక్రాంతి): మండలంలోని తాండూరు గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ భూమా యాదా గౌడ్(Sarpanch Bhuma Yada Goud) అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఇప్పటివరకు గ్రామానికి వచ్చిన ఆదాయ వ్యయంల గురించి గ్రామస్తులకు వివరించి, గ్రామంలో పలు వార్డులలో ఉన్న సమస్యల గురించి రాబోయే కాలంలో గ్రామపంచాయతీ తరపున చేపట్టబోయే పనులకు తీర్మానాలు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదా గౌడ్, ఉప సర్పంచ్ అభిషేక్ పాలకవర్గ సభ్యులు,నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ప్రభాకర్,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు వేముల సంగయ్య,లైన్ డిపార్ట్మెంట్ అధికారులు,గ్రామ ప్రజలు యువకులు పాల్గొనడం జరిగింది.

మరిన్ని వార్తలు