ప్రతి కుటుంబానికి భరోసా......భీమా పథకం....
తాడ్వాయి,నవంబర్,23( విజయ క్రాంతి): ప్రతి కుటుంబానికి భరోసా... ఇందిరమ్మ జీవిత బీమా పథకం(Indiramma Jeevitha Bima Scheme) అని కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గైని శివాజీ, స్థానిక సర్పంచ్ తాజోద్దీన్ లు తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామంలో సోమవారం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని వారు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి కుటుంబానికి రక్షణగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు.
ఈ పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు గంట బాలరాజు,మైనార్టీ మండల ఉపాధ్యక్షులు కరామత్ అలీ, నాయకులు ఎండీ ఫారుక్, లింగం,హమీద్, గంట రవి, గైని రాజు, సందీప్,శేఖర్,రాజు, భరత్ కుమార్,గ్రామ కార్యదర్శి సౌమ్య, కారోబార్ బాపూరావు తదితరులు పాల్గొన్నారు.