ఘనంగా కూతుర్ల దినోత్సవం
27-09-2026 | 08:19pm
కామారెడ్డి, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ కృష్ణపరివార కాలనీలో ఆదివారం కూతుర్ల దినోత్సవం(Daughters Day) సందర్భంగా తల్లిదండ్రులు కేక్ కట్ చేసి దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పాటల పోటీలు నిర్వహించి, వివిధ నృత్యాలతో అలరించారు.