మద్నూర్‌ మండలంను నిజామాబాద్‌ జిల్లాలో కలపాలంటూ డిమాండ్

27-09-2026 | 09:38pm

ఎంపీడీవోకు వినతిపత్రం 

బిచ్కుంద, సెప్టెంబర్ 27 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలాన్ని  నిజామాబాద్ జిల్లా(Nizamabad District)లో కలపాలంటూ మద్నూర్ మండ ప్రజలు మరోసారి గళం విప్పారు. ఆగస్టు 24న శివాజీ అప్ప ఆధ్వర్యంలో సుమారు 20 మంది ప్రజలు మద్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో(Madnoor MPDO Office) జరిగిన ప్రజావాణిలో(Public Voice) ఫిర్యాదు చేశారు.

మద్నూర్ నుంచి పాత నిజామాబాద్ జిల్లా కేంద్రం సుమారు 75 కిలోమీటర్లు ఉండగా, ప్రస్తుతం కామారెడ్డి జిల్లా కేంద్రం సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉందని వారు తెలిపారు.ఈ నేపథ్యంలో జిల్లా మార్పు అంశంపై ప్రజల కోరికను పరిశీలిస్తూ నివేదిక ఇవ్వాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ నుంచి సంబంధిత అధికారులకు సర్కులర్ జారీ అయినట్లు సమాచారం. ఇప్పుడు మద్నూర్ మండలానికి జిల్లా మార్పుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

మరిన్ని వార్తలు