ఆర్చరీ సెలక్షన్స్‌లో దోమకొండ విద్యార్థుల ప్రతిభ

27-09-2026 | 09:43pm

ఉమ్మడి జిల్లా స్థాయి పోటీల్లో పలు స్థానాలు

దోమకొండ, సెప్టెంబర్ 27 (విజయ క్రాంతి) : బాన్సువాడ మండలం(Banswada Mandal) తిర్మలాపూర్ క్యాంప్‌లోని జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉమ్మడి నిజామాబాద్–కామారెడ్డి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఆర్చరీ సెలక్షన్స్(Nizamabad–Kamareddy District-Level School Games Archery Selections) నిర్వహించారు. ఇండియన్, రికర్వ్ రౌండ్ విభాగాల్లో దోమకొండకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు స్థానాలు సాధించారు.

U/14 ఇండియన్ రౌండ్: బాలికల్లో జె. శ్రీజ 4వ స్థానం; బాలురలో హెచ్. గ్రిష్మంత్ 2వ, సిహెచ్. అశ్వష్ 3వ స్థానాలు సాధించారు.U/17 ఇండియన్ రౌండ్: బాలికల్లో యాన్. ప్రీతి, బాలురలో ఎస్.కె. రెహాన్ 3వ స్థానాల్లో నిలిచారు.U/14 రికర్వ్ రౌండ్: బాలికల్లో ఎస్. పూర్ణమై 2వ, ఎస్. నైతిక 3వ స్థానాలు సాధించారు.U/17 రికర్వ్ రౌండ్: బాలికల్లో బి. ఇందు 1వ, పి. నక్షత్ర 2వ స్థానాలు; బాలురలో ఎస్. స్నేహిత్ 1వ, ఎస్. నిషిత్ కుమార్ 2వ స్థానాలు సాధించారు.ఎంపికైన క్రీడాకారులు హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఆర్చరీ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులు  తిరుమల్ గౌడ్, కార్యదర్శి కదిరే మోహన్ రెడ్డి, కోశాధికారి కే. గంగాధర్, కోచ్ ప్రతాప్ దాస్, ట్రస్ట్ ప్రతినిధి అనిల్ కామినేని క్రీడాకారులను అభినందించారు.

మరిన్ని వార్తలు