కవులు ప్రజల పక్షం నిలిచి రచనలు చేయాలి

27-09-2026 | 09:50pm

తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు గఫూర్  శిక్షక్

కామారెడ్డి, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): కవులు ప్రజల పక్షం నిలిచి రచనలు చేయాలని తెలంగాణ రచయితల వేదిక(Telangana Writers Forum) జిల్లా అధ్యక్షులు గపూర్ శిక్షక్(Gafoor Shikshak) అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా(Kamareddy District) కేంద్రంలో తెలంగాణ రచయితల వేదిక సంఘం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నిల ముచ్చట్లు సమన్వయకర్త గంగ ప్రసాద్ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

తెలంగాణ రచయితల వేదిక ప్రజల పక్షం వహించి నిత్యం చైతన్యవంతం చేస్తూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో పండిత పరిషత్ డివిజన్ అధ్యక్షులు సుదర్శన్, శ్రీనివాస్, పీతాంబర్, మారుతీ, మోహన్ రాజ్, మెదక్ జిల్లా తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు తిరుపతి, నాగభూషణం, రవీందర్ ,బాలకృష్ణ, నరసయ్య, చంద్రకాంత్, తిరుపతిరావు, పాల్గొని కవి సమ్మేళనం, కవిత గానాలు చేశారు.

మరిన్ని వార్తలు