అనురాగ్ లో జెన్‌ఏఐ క్యాటలిస్ట్ వర్క్‌షాప్
27-09-2026 | 09:57pm
ఘట్ కేసర్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ(Anurag University), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం ఆధ్వర్యంలో ఐఎస్టి ఈ ప్రొఫెషనల్ చాప్టర్ సహకారంతో ప్రాంప్ట్స్ టు ప్రొడక్షన్ వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించారు. ఈ రెండు రోజుల కార్యక్రమంలో సుమారు 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు జనరేటివ్ ఏఐపై అవగాహనతో పాటు ప్రాక్టికల్, హ్యాండ్స్-ఆన్ శిక్షణ అందించారు.
ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని ఎం. మాధవి, సరళ, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లుగా సమర్థవంతంగా నిర్వహించారు. విద్యార్థులు వర్క్‌షాప్‌పై సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రాక్టికల్, ఇంటరాక్టివ్ సెషన్స్ తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు.