చట్టవిరుద్ధంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ సీజ్

27-09-2026 | 09:57pm

​హత్నూర, సెప్టెంబరు 27: అక్రమంగా ఇసుకను రవాణా(Sand transportation) చేస్తున్న ఓ టిప్పర్‌ను శనివారం హత్నూర పోలీసులు(Hathnoora Police) స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పోలీస్ స్టేషన్ పరిధిలోని దౌల్తాబాద్ చౌరస్తా వద్ద పోలీసులు పగటిపూట నిఘా (డే పెట్రోలింగ్) నిర్వహిస్తున్నారు.

​మధ్యాహ్నం 2 గంటల సమయంలో అటుగా వచ్చిన అశోక్ లేలాండ్ టిప్పర్(Ashok Leyland Tipper) (TS 08 UJ 2466)ను ఆపి తనిఖీ చేయగా అందులో ఇసుక గుర్తించారు. ఇసుక రవాణాకు సంబంధించి ఎలాంటి ప్రభుత్వ అనుమతి పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని సీజ్ చేశారు.

​డ్రైవర్ షేక్ చాంద్ పాషా (39)ని విచారించగా, యజమాని ఆదేశాల మేరకు ఇస్మాయిల్‌ఖాన్ పేట్ నక్కవాగు నుంచి గుమ్మడిదలకు ఇసుకను తరలిస్తున్నట్లు అంగీకరించాడు. పోలీసులు టిప్పర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు