అంగన్ వాడి టీచర్లకు ఘనంగా సన్మానం..
తాడ్వాయి,అక్టోబర్,06( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడువాయి మండల కేంద్రంలో మంగళవారం బిజెపి పార్టీ నాయకులు(BJP party leaders) అంగన్ వాడి టీచర్లను ఘనంగా సన్మానించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ ఆదేశాల మేరకు సేవా సంకల్ప అభియాన్(Seva Sankalp Abhiyan) కార్యక్రమంలో భాగంగా అంగన్ వాడీ టీచర్లను సన్మానించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా బిజెపి అధ్యక్షులు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ... దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు రవీందర్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రి, నాయకులు సంజీవ్,కిషన్, రాజు రనిల్ రెడ్డి, మోహన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.