జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపెళ్లి భాస్కర్ రావు
గణపురం, అక్టోబర్ 05 (విజయక్రాంతి): ఈనెల 9న జయశంకర్ జిల్లా భూపాలపల్లి పుష్ప గార్డెన్ లో నిరుద్యోగ యువతీ యువకులకు విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని గణపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాళ్లపెళ్లి భాస్కర్ రావు(Congress leader Thallapelli Bhaskar Rao) అన్నారు.
సోమవారం ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు మేళాలో పాల్గొని అభ్యర్థులను నేరుగా ఎంపిక చేయనున్నాయని తెలిపారు.
ఇంటర్, డిగ్రీ, డిప్లమా, ఐటిఐతో పాటు ఇతర కోర్సులు పూర్తి చేసిన వారు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా జాబ్ మేళాకు హాజరు కావచ్చని పేర్కొన్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులు ఒకే చోట అందుబాటులో ఉంటారని అభ్యర్థులు తమ అర్హతకు అనుగుణంగా ఉద్యోగాలను ఎంచుకోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరి శ్రీనివాస్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి చోటె మియా, మామిండ్ల మల్లికార్జున్ గౌడ్, ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ గౌడ్, గుర్రం తిరుపతి గౌడ్, సైదులు పాష, శివ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.