రుతుపవనాలు తిరోగమనం. తెలంగాణలో వానలు!

05-10-2026 | 07:36am

రుతుపవనాలు తిరోగమనం. తెలంగాణలో వానలు!

నైరుతి రుతుపవనాల తిరోగమనం (withdrawal) ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి రానున్న 24 గంటల్లో రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించే ఛాన్స్ (chance) ఉందని పేర్కొంది. సోమ, మంగళవారాల్లో నల్గొండ, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, యాదాద్రి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (rainfall) కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.రుతుపవనాల నిష్క్రమణతో వాతావరణంలో మార్పులు (changes) చోటుచేసుకునే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరిన్ని వార్తలు