తహసీల్దార్ కార్యాలయం గేటు ముందు వాహనాల పార్కింగ్

05-10-2026 | 08:42pm

సిర్గాపూర్ అక్టోబర్ 05 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ (ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కార్యాలయం) మేన్ ఎంట్రెన్స్ గేటు ముందు ప్రైవేటు వాహనాలు అడ్డంగా పెట్టి పార్కింగ్ అడ్డాగా మారింది. గేటు ముందు ఇష్టారీతిలో వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే స్థానికులు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే వారి రాక పోకలకు తీవ్ర ఆటంకం, విఘాతం కలిగిస్తున్నారని అది కుడా మెన్ రోడ్డు కావడం ఖేడ్ నుండి చుట్టూ ప్రక్కల గ్రామాలకు వెళ్లే వాహనాలకు ఇబ్బంది కరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు