ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య..

05-10-2026 | 08:38pm

పాపన్నపేట: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని పొడ్చన్ పల్లి తండాలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్(SI Srinivas Goud) కథనం ప్రకారం.. పొడ్చన్ పల్లి తండాకు చెందిన పాల్త్య అంబ్రియా(68) వ్యవసాయం చేసుకుంటూ జీవితం గడుపుతున్నాడు. కొన్ని రోజులుగా మద్యానికి బానిసగా మారి పిచ్చిగా ప్రవర్తిస్తూ తరచూ ఇంట్లో కుటుంబీకులతో గొడవ పడుతున్నాడు. మద్యం తాగొద్దని ఎంత చెప్పినా వినేవాడుకాదు.

ఆదివారం సాయంత్రం సమయంలో మద్యం దుకాణం వద్ద ఉండగా కుటుంబీకులు ఇంటికి రమ్మని ఎంత చెప్పిన వెళ్ళలేదు. రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోయేసరికి చుట్టూ పక్కల వెతికారు. సోమవారం ఉదయం తండా సమీపంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు