కొల్లాపూర్ ఆర్టీసీ బస్టాండ్ కంపు కంపు

05-10-2026 | 08:41pm

కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool district) కొల్లాపూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్(RTC Bus Stand) ఆవరణంలో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యంగా మారుతుంది. నిత్యం వందలాది  మంది ప్రయాణికులు రాకపోకలు సాధించే ఈ ప్రాంతంలో మూత్రశాల మలవిసర్జనతో దుర్వాసన వెదజల్లుతుండడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సుల కోసం వేచి ఉండాల్సిన ప్రయాణికులు దుర్వాసన మధ్యకాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాదు. పెబ్బేరు. వనపర్తి నుంచి వచ్చే ప్రయాణికులు బస్సు దిగంగానే దుర్వాసన రావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొల్లాపూర్(Kollapur) పట్టణంలో ప్రజలకు అవసరమైన అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ బస్టాండ్ ఆవరణం మాత్రం కనీసం అపరిశుభ్రతకు నోచుకోవడం లేదని  ప్రయాణికులు వాపోతున్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్న ఈ ప్రాంగణం  అభివృద్ధి పరిశుద్యం నిర్వహణ విషయంలో నిర్లక్ష్యానికి గురవుతోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మలమూత్రశాలలు  అందుబాటులో ఉన్నప్పటికీ బస్టాండులో మలమూత్రశాలలు ఉన్నప్పటికీ పరిశుభ్రంగా లేకపోవడంతో కొందరు ప్రయాణికులు వాటిని వినియోగించకుండా బహిరంగంగా మలమూత్ర విసర్జన చేస్తున్నారు.

అయితే అందుబాటులో ఉన్న సౌకర్యాలను ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పించడంలో అధికారులు పర్యవేక్షణ ఎంతవరకు ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బస్టాండ్ లో ఇక్కడ బహిరంగంగా మలమూత్ర విసర్జన చేయరాదు. మలమూత్ర శాలలను వినియోగించుకోండి అంటూ స్పష్టమైన అవగాహన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా బస్టాండ్ పరిసరాలను నిరంతరం శుభ్రపరిచేలా ప్రత్యేక పరిశుద్యం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు