దేమికలాన్ సింగిల్ విండో చైర్మన్ గా వెంకట్ రెడ్డి
05-10-2026 | 08:35pm
తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy district) తాడ్వాయి మండలం దేమికలాన్ సింగిల్ విండో అధ్యక్షుడిగా ఏనుగు వెంకట్ రెడ్డిని ఎమ్మెల్యే కే.మదన్ మోహన్ రావు(MLA K.Madan Mohan Rao) నియమించినట్లు తాడువాయి మండల కాంగ్రెస్(Congress) పార్టీ అధ్యక్షులు బండారు సంజీవులు తెలిపారు. కన్కల్ గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డిని చైర్మన్ గా నియమించినట్లు ఆయన వివరించారు. పార్టీలో కష్టపడ్డ వారికే పదవులు కట్టబెడతామని ఎమ్మెల్యే తెలిపారన్నారు. కాగా తాడువాయి సింగిల్ విండో చైర్మన్ గా ఏండ్రియాల్ గ్రామానికి చెందిన సంతాజి గారి సుధాకర్ రావును నియమించినట్లు తెలిసింది.