చికెన్ తింటున్నారా.. జాగ్రత్త!
05-10-2026 | 02:12pm
అనంతపురం జిల్లాలో బర్డ్ ఫ్లూ (Bird Flu) కలకలం రేపుతోంది. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురంలో నెల రోజుల వ్యవధిలో సుమారు 2,500 నాటు కోళ్లు మృతి చెందాయి. దీంతో కోళ్ల పెంపకందారులకు దాదాపు రూ.10 లక్షల మేర నష్టం (Loss) వాటిల్లినట్లు తెలుస్తోంది.
కోళ్లు మృతి చెందడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తమై నమూనాలను (Samples) భోపాల్‌కు పంపించారు. పరీక్షల్లో బర్డ్ ఫ్లూగా నిర్ధారణ (Confirmation) అయినట్లు అధికారులు తెలిపారు.దీంతో సిద్ధరాంపురం, పరిసర ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు (Precautionary Measures) చేపట్టారు. వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా అధికారులు పర్యవేక్షణ (Monitoring) కొనసాగిస్తున్నారు.