కార్మికుల కోసం కవిత డిమాండ్లు

05-10-2026 | 11:44am

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ను కవిత ముట్టడించారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు 35 శాతం వాటా (share) ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డును నెలకు రెండుసార్లు నిర్వహించి.. దరఖాస్తు చేసుకున్న వారిని అన్‌ఫిట్ చేయాలని కోరారు. మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని, జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ (recruitment) చేయాలని డిమాండ్ చేశారు. విజిలెన్స్ కారణంగా నిలిచిపోయిన డిపెండెంట్ల ఉద్యోగాలను వెంటనే ఇవ్వాలని కోరారు.

కార్మికులకు సొంత ఇళ్ల కోసం రెండుగుంటల భూమి కేటాయించాలని, కొత్త బొగ్గు బ్లాకులు (coal blocks) సింగరేణికి ఇవ్వాలని అన్నారు. అలాగే సింగరేణి కార్మికుల ఆదాయపు పన్నును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు వేతనాలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం సింగరేణికి బకాయిపడిన రూ.62 వేల కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం (struggle) కొనసాగుతుందని కవిత పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు